శ్రీరామ నవమి శుభాకాంక్షలు
ఈరోజు భీముని మల్లారెడ్డిపేట్ సీతారాముల కళ్యాణం జరిగింది
ఈరోజు తప్పక రాముని స్తోత్రం, అష్టోత్తరం లేదా
రామునికి ప్రీతి పాత్రుడైన హనుమన్ స్తోత్రం హనుమాన్ చాలీసా వంటివి చేయాలి
నామమంత్రం
'శ్రీరామ జయ రామ జయ జయ రామ' అనేది పదమూడు అక్షరాల నామ మంత్రం. దీనిని పఠించడం వల్ల కూడా విశేషమైన పుణ్యఫలాలు కలుగుతాయి. సమర్థరామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్లు జపించి శ్రీరాముడి ప్రత్యక్ష దర్శనాన్ని పొందినట్లు పురాణకథనం. వీలున్నప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తూ వుండడం శ్రీరామరక్ష.
రామకోటి
చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం
ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం
అంటే 'రామ' అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. 'రామకోటి' రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామనవమినాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు. శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలుపెట్టవచ్చు. రాసేవారు కొన్ని నియమాలను పాటిస్తే శ్రీరాముడి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి
ప్రస్తుత పరిస్థులలో అందరికీ ఆరోగ్యం బాగుండడానికి.ఎటువంటి భయంకర, కరోనా మహమ్మారి అంటు వ్యాధులు సోకకుండా రాకుండా చేయమని .. " ప్రస్తుత పరిస్థులలో మనము యధా శక్తిగా ఎవరి ఇంటిలోనే వారు ఉండి ఇంటిలోనే పండుగ చేసుకోవడం మంచిదని ....ఏవైనా కానుకలు దానాలు ఇవ్వాలనుకుంటే పరిస్థుతులు చక్కబడ్డాక ఇవ్వవచ్చు.. అదే విధంగా మానవ సేవయే మాధవ సేవ కాబట్టి అన్నార్తులకు పేద ప్రజలకు..శ్రీరామనవమి సందర్భంగా తమ వంతు అదేవిధంగా ఆకలితో అలమటించే వారికి మరియు భారతదేశ ప్రభుత్వానికి కూడా తన వంతు సహాయ సహకారాలు అందించండి... ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మీ ఇంట్లోనే ఉండి రామనామ జపం మాత్రం మర్చిపోకండి ఓం శ్రీరామ జయ రామ జయజయ రామ...... ఈ మంత్రమును మీకు వీలైనన్నిసార్లు రేపు ఇంట్లోనే జపించండి.. ఎవరింట్లో వాళ్ళు ఉండండి ప్రభుత్వానికి సహకరించండి రామనామ జపం మాత్రం మర్చిపోకండి..సర్వేజనా సుఖినో భవంతు ....లోకా సమస్తా సుఖినోభవంతు.. అధర్మస్యనాశోస్తు ..ధర్మస్య జయోస్తు ....ధర్మో రక్షతి రక్షితః... జై శ్రీ రామ్.జై శ్రీ రామ్.జై శ్రీ రామ్....