Wednesday, April 1, 2020

భగవద్ బంధువులకు ...మిత్రులకు శ్రేయోభిలాషులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు

శ్రీరామ నవమి శుభాకాంక్షలు

ఈరోజు  భీముని మల్లారెడ్డిపేట్ సీతారాముల కళ్యాణం  జరిగింది

ఈరోజు తప్పక రాముని స్తోత్రం, అష్టోత్తరం లేదా 
రామునికి ప్రీతి పాత్రుడైన హనుమన్ స్తోత్రం హనుమాన్ చాలీసా వంటివి చేయాలి

నామమంత్రం 

'శ్రీరామ జయ రామ జయ జయ రామ' అనేది పదమూడు అక్షరాల నామ మంత్రం. దీనిని పఠించడం వల్ల కూడా విశేషమైన పుణ్యఫలాలు కలుగుతాయి. సమర్థరామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్లు జపించి శ్రీరాముడి ప్రత్యక్ష దర్శనాన్ని పొందినట్లు పురాణకథనం. వీలున్నప్పుడు ఈ మంత్రాన్ని జపిస్తూ వుండడం శ్రీరామరక్ష.
రామకోటి 
చరితం రఘునాధస్య శతకోటి ప్రవిస్తరం 
ఏకైన మక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం 
అంటే 'రామ' అనే పేర్లు లక్ష కోటి రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపజేస్తుందని స్వయంగా పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలోని ఉమామహేశ్వర సంవాదంలో వివరింపబడింది. 'రామకోటి' రాయడం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం. చాలామంది శ్రీరామనవమినాడు రామకోటి రాయడం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు. శ్రీరామ నవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయడం మొదలుపెట్టవచ్చు. రాసేవారు కొన్ని నియమాలను పాటిస్తే శ్రీరాముడి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి


ప్రస్తుత పరిస్థులలో అందరికీ ఆరోగ్యం బాగుండడానికి.ఎటువంటి భయంకర,  కరోనా మహమ్మారి అంటు వ్యాధులు సోకకుండా రాకుండా  చేయమని  .. "  ప్రస్తుత పరిస్థులలో మనము యధా శక్తిగా  ఎవరి ఇంటిలోనే వారు ఉండి ఇంటిలోనే పండుగ చేసుకోవడం మంచిదని ....ఏవైనా కానుకలు    దానాలు ఇవ్వాలనుకుంటే పరిస్థుతులు చక్కబడ్డాక ఇవ్వవచ్చు.. అదే విధంగా మానవ సేవయే మాధవ సేవ కాబట్టి అన్నార్తులకు పేద ప్రజలకు..శ్రీరామనవమి సందర్భంగా తమ వంతు అదేవిధంగా ఆకలితో అలమటించే వారికి మరియు భారతదేశ ప్రభుత్వానికి కూడా తన వంతు సహాయ సహకారాలు అందించండి... ఎవరు కూడా ఇబ్బంది పడకుండా మీ ఇంట్లోనే ఉండి రామనామ జపం మాత్రం మర్చిపోకండి ఓం శ్రీరామ జయ రామ జయజయ రామ...... ఈ మంత్రమును మీకు వీలైనన్నిసార్లు రేపు ఇంట్లోనే జపించండి.. ఎవరింట్లో వాళ్ళు ఉండండి ప్రభుత్వానికి సహకరించండి రామనామ జపం మాత్రం మర్చిపోకండి..సర్వేజనా సుఖినో భవంతు ....లోకా సమస్తా సుఖినోభవంతు..  అధర్మస్యనాశోస్తు ..ధర్మస్య జయోస్తు ....ధర్మో రక్షతి రక్షితః... జై శ్రీ రామ్.జై శ్రీ రామ్.జై శ్రీ రామ్....






Monday, October 1, 2018

శ్రీ వాల్మీకి రామాయణం-3

రామాయణం -- 3
రామాయణం ప్రారంభం చేస్తూ వాల్మీకి మహర్షి ఇలా అంటారు.............
పూర్వకాలంలొ కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడువు, 3 యోజనముల వెడల్పు ఉండేది( యోజనం అంటె = 9 మైళ్ళు ). ఆ నగరం మధ్యలొ రాజ ప్రాసాదంలొ దశరథ మహారాజు నివాసముండేవారు. ఆ నగరంలొ రహదారులన్నీ విశాలంగా, ఎప్పుడూ సుగంధ ధూపాలతొ ఉండేవి. ధాన్యం, చెరుకు లాంటి పంటలన్నీ బాగా పండేవి ఆ రాజ్యంలొ. ఏ ఇంట్లోనుకుడా అనవసరంగా ఉన్న నేల లేదు. అయోధ్య నగరంలొ అందరూ చాలా సంతోషంగా ఉండేవాళ్ళు, అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, ఎవడికి ఉన్నదానితొ వాడు తృప్తిగా ఉండేవాళ్ళు, అందరూ దానం చేసేవాళ్ళు, సత్యమే పలికేవాళ్ళు, అందరూ ఐశ్వర్యవంతులే, ఆవులు, గుర్రాలు, ఏనుగులతొ ఆ నగరం శోభిల్లేది. చెవులకి కుండలములు లేనివాడు, కిరీటం లేనివాడు, మెడలొ పూలహారం లేనివాడు, హస్తములకు ఆభరణములు లేనివాడు, దొంగతనం చేసేవాడు, నాస్తికుడైనవాడు ఆ అయోధ్య నగరంలొ లేడు.
దశరథ మహారాజుకి 8 ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారు, వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు, అర్ధసాధకుడు, అశోకుడు, మంత్రపాలకుడు, సుమంత్రుడు. వశిష్ఠుడు, వామదేవుడు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇచ్చె ఋత్విక్కులు. ఇతరమైన బ్రాహ్మణులూ, మంత్రులు కూడా ఉండేవారు. ఆ మంత్రులు అపారమైన విద్య కలిగిన వాళ్ళు, పని చెయ్యడం తెలిసినవాళ్లు, ఇంద్రియములను నిగ్రహించినవాళ్లు, శ్రీమంతులు, శాస్త్రము తెలిసిన వాళ్ళు, సావధాన చిత్తం కలిగినవాళ్ళు. ఆ కోసల దేశంలొ పరభార్య మీద వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేడు.
ఇన్ని ఉన్నా ఆ దశరథ మహారాజుకి ఒక బాధ ఉండేది. వంశోద్దారకుడైన పుత్రుడు లేడనే బాధ ఉండేది. ఆయనకి అప్పటికి 60,000 సంవత్సరాలు నిండిపోయాయి. ఆయనకి అశ్వమేథ యాగం చెయ్యాలనే ఆలోచన వచ్చి, వెంటనే సుమంత్రుడిని పిలిచి, ఋత్విక్కులైన వశిష్ఠుడు, వామదేవుడు మరియు ఇతర పురోహితులని పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచన చెప్పాడు. అందరూ సరే అన్నారు. అశ్వమేథ యాగానికి కావాల్సిన సంభారములన్నీ తెప్పించి, సరయు నదికి ఉత్తర తీరంలొ యాగమంటపం నిర్మించారు.
దశరథ మహారాజు దక్షిణ నాయకుడు, ఆయనకి 300 కి పైగా భార్యలున్నారు. కాని ముఖ్య పత్నులు మాత్రం కౌసల్య, సుమిత్ర, కైకేయి. తను యాగం మొదలపెడుతున్నాడు కాబట్టి, వారిని దీక్ష స్వీకరించమన్నాడు. అంతఃపురంలోకి వెళుతున్న దశరథ మహారాజుతొ సుమంత్రుడు ఇలా అన్నాడు...........
సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం |
ఋషీణాం సన్నిధౌ రాజన్ తవ పుత్రాగమం ప్రతి ||
పూర్వకాలంలొ ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు............ఇక్ష్వాకువంశములొ జన్మించిన దశరథ మహారాజుకి కుమారులు లేక అశ్వమేథ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి నలుగురు కుమారులు కలుగుతారు. కాని అశ్వమేథ యాగంతొ పాటు పుత్రకామేష్టి యాగం కూడా చెయ్యాలి. ఈ రెండు యాగాలని చెయ్యగలిగినవాడు రుష్యశృంగుడు. ఆయన ఆ యాగాలని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను అని సుమంత్రుడు దశరథ మహారాజుతొ అన్నాడు.ఆ రుష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలొ ఉన్నాడు, కాబట్టి మీరు వెళ్లి ఆయనని తీసుకొని రండి అన్నాడు.
అప్పుడు దశరథ మహారాజు, నాకు ఆ రుష్యశృంగుడు గురించి వివరంగా చెప్పు అంటె, సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు.............పూర్వకాలంలొ విభణ్డక మహర్షి చాలాకాలం తపస్సు చేసి స్నానం చెయ్యడానికి ఒక సరస్సు దెగ్గరికి వెళ్ళగా, అక్కడ అలా వెళుతున్న ఊర్వశిని చేసేసరికి ఆయన రేతస్థానము నుంచి కదిలిన వీర్యం సరోవరంలొ పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి, గర్భం దాల్చి, శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టి ఆయనకి రుష్యశృంగుడు అని పేరు పెట్టారు. ఆ విభణ్డక మహర్షి, రుష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కాని ఆ రుష్యశృంగుడికి లోకం తెలీకుండా పెంచాడు, ఆయనకి అసలు ఈ సృష్టిలో స్త్రీ-పురుషులని ఇద్దరు ఉంటారని కూడా తెలీకుండా పెంచాడు. అంటె విషయసుఖాల వైపు వెళ్ళకుండా పెంచాడు. ఎప్పుడూ ఆ ఆశ్రమంలోనే, తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలొ వర్షాలు పడడం మానేశాయి. దేశంలొ క్షామం వచ్చింది. రుష్యశృంగుడు కాని మన దేశంలొ అడుగుపెడితే వర్షాలు తప్పక కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారు.
వెంటనే రాజు మంత్రుల్ని పిలిచి విషయం చెప్తే, రుష్యశృంగుడిని తీసుకురావడం మావల్ల కాదు, ఏమి కోరికలు లేని వాడు, మన రాజ్యానికి ఎందుకు వస్తాడు అన్నారు. ఎంతైనా మంత్రులు కనుక ఒక మాట అన్నారు..... ఇంద్రియార్థైః అభిమతైః నరచిత్త ప్రమాథిభి |. రుష్యశృంగుడికి కుడా ఇంద్రియాలు, మనస్సు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక, విషయసుఖాల వైపుకి రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలని పంపిస్తే, విభణ్డకుడు లేని సమయంలో వీళ్ళు ఆ రుష్యశృంగుడి మనస్సుని ఆకర్షించి, ప్రలోభపెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు, అని మంత్రులు సలహా ఇచ్చారు.
ఆ వేశ్యలకి విభణ్డకుడి మీద ఉన్న భయం వలన, వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చెయ్యడం మొదలుపెట్టారు. ఒకరోజు విభణ్డకుడు లేని సమయంలో గానం విన్న రుష్యశృంగుడు, ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడు. అక్కడున్న ఆ వేశ్యలని చూసి, వాళ్ళు పురుషులే అనుకొని, మహాపురుషులార! మీరు మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడు. అందరూ విభణ్డకుడి ఆశ్రమానికి వెళ్లారు. తరువాత ఆ వేశ్యలు ఆశ్రమంనుంచి వెళ్ళిపోతూ ఆ రుష్యశృంగుడిని గట్టిగ కౌగలించుకుని వెళ్ళిపోయారు. మరునాడు ఆ రుష్యశృంగుడికి మనసులో దిగులుగా అనిపించి, ఆ వేశ్యలని చూడాలనిపించి, వాళ్ళ దెగ్గరికి వెళ్ళాడు. ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మన్నారు. సరే అని అందరూ బయలుదేరారు. ఆయన అలా అంగదేశంలో అడుగుపెట్టగానే..........
తత్ర చ ఆనీయమానే తు విప్రే తస్మిన్ మహాత్మని |
వవర్ష సహసా దేవో జగత్ ప్రహ్లాదయన్ తదా ||
ఆకాశం నుంచి బ్రహ్మాండమైన వర్షం కురిసింది. వెంటనే రోమపాదుడు రుష్యశృంగుడికి నమస్కారం చేసి, ప్రార్ధించి, అంతఃపురానికి తీసుకెళ్ళి తన కుమార్తె అయిన శాంతని ఇచ్చి వివాహం జెరిపించారు.
కాబట్టి దశరథ మహారాజు ఆ రుష్యశృంగుడిని పిలవడానికి, అంగదేశానికి స్వయంగా వెళ్ళాడు. అక్కడ 8 రోజులున్నాక, వెళ్ళిపోతూ దశరథుడు రోమపాదుడితొ ఇలా అన్నాడు...మా ఇంట్లో ఒక ముఖ్యమైన కార్యం ఉంది, కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా, అని అడిగాడు. రోమపాదుడు ఆనందంగా పంపించాడు. దశరథుడు చాలా సంతోషించి, వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్ళాడు.

Friday, September 28, 2018

శ్రీ వాల్మీకి రామాయణం-2

బాలకాండ
వాల్మీకి మహర్షి గురించి స్కాంద పురాణంలొ సనత్ కుమారుడు వ్యాస మహర్షికి వివరించాడు. సుమతి - కౌశికి అనే బ్రాహ్మణ దంపతుల కుమారుడి పేరు అగ్నిశర్మ. ఆ అగ్నిశర్మకి చదువు, అనగా వేదములు మొదలైనవి సరిగ్గా అబ్బలేదు. ఆ రాజ్యంలో క్షామం వచ్చి, ఎవరూ ఎవరికీ దానధర్మాలు చెయ్యడం లేదు. కాబట్టి అగ్నిశర్మ తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులతో అరణ్యానికి వెళ్లి, అక్కడ దొరికే కందమూలాలు, తేనె లాంటివి తెచ్చుకొని బ్రతుకుతున్నాడు. చదువు సరిగ్గా అబ్బనందువల్ల అక్కడ ఉండే దొంగలతో స్నేహం చేసి దొంగతనాలు చెయ్యడం ప్రారంభించాడు. ఒకసారి అటుగా వెళుతున్న కొంతమంది మహర్షులను ఆపి మీదెగ్గర ఉన్నది ఇవ్వండి, లేకపోతె చంపుతాను అన్నాడు. ఆ మహర్షులలో ఉన్న అత్రి మహర్షి "నువ్వు ఈ దొంగతనాలు ఎందుకు చేస్తున్నావు" అని అగ్నిశర్మని అడిగారు. నన్ను నమ్ముకున్న నా భార్యని, నా తల్లిదండ్రులని పోషించుకోవడానికి అని చెప్పాడు శర్మ. అలా అయితే, నువ్వు ఇప్పటిదాకా చేసిన ఈ దొంగతనాల వల్ల నీకు కలిగిన పాపాన్ని, నీ కుటుంబ సభ్యులలో ఎవరన్నా పంచుకుంటారేమో అడిగిరా అని అత్రి మహర్షి అన్నారు.
మమ్మల్ని పోషించడం నీ కర్తవ్యం, కాబట్టి నువ్వు మమ్మల్ని పోషించాలి. నువ్వు తెచ్చావు, మేము అనుభవిస్తాము. కాని, ఎలా తెచ్చావు అన్నదానికి ఇచ్చె ఫలితాన్ని నువ్వే అనుభవించాలి అని అన్నారు శర్మ కుటుంబసభ్యులు. చాలా బాధ కలిగి, మళ్ళి ఆ ఋషుల దెగ్గరికి వచ్చి, నా పాపాలను పోగొట్టుకునే మార్గం చెప్పమన్నాడు. ధ్యానం చెయ్యి అని అత్రి మహర్షి చెప్పి వెళ్ళిపోయారు. 13 సంవత్సరాల తరువాత ఆ మహర్షులు ఇదే దారిలో తిరిగొస్తుంటే అక్కడ ఒక పెద్ద పుట్ట కనబడింది. ధ్యానమగ్నుడై ఉన్న అగ్నిశర్మ మీద పుట్టలు పెరిగాయి. తన మీద పుట్టలు(వల్మీకం) కట్టినా తెలియని స్థితిలో ఉన్నాడు కాబట్టి, ఆయనని వాల్మీకి అని పిలిచి, బయటకి రమ్మన్నారు. ఇది ఆయనకి పౌరుష నామమయ్యింది. అప్పుడు ఆ మహర్షులు ఆయనని ఉత్తర దిక్కుకి వెళ్లి భగవంతుడిని ధ్యానం చెయ్యమన్నారు. వాల్మీకి మహర్షి కుశస్థలి అనే ప్రదేశానికి వెళ్లి, పరమశివుడిని ఆరాధన చేశారు. అప్పుడాయనకి విష్ణు కథ రాయగలిగే అదృష్టాన్ని బ్రహ్మగారు ఇచ్చారు. అంటె, ఆయనకి త్రిమూర్తుల అనుగ్రహం లభించిందన్నమాట.
తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరం |
నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్మునిపుంగవం ||
వాల్మీకి మహర్షి రామాయణంలొ రాసిన మొదటి శ్లోకం. దీని అర్ధం ఏంటంటె, తపస్వి, ముని, గొప్ప వాగ్విదాంవరుడైన నారద మహర్షిని పరిప్రశ్న చేయడానికి తపస్వియైన వాల్మీకి మహర్షి సిద్ధపడుతున్నారు అని. వాల్మీకి మహర్షి నారదుడిని ఏమడిగారంటె................
కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః ||
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియదర్శనః ||
ఆత్మవాన్ కో జిత క్రోధో ద్యుతిమాన్ కః అనసూయకః |
కస్య బిభ్యతి దేవాః చ జాత రోషస్య సంయుగే ||
ఈ లోకంలొ ఇప్పుడే, ఇక్కడే ఉన్న గుణవంతుడు, వీర్యవంతుడు, ధర్మాత్ముడు, కృతజ్ఞత భావం కలిగినవాడు, సత్యం పలికేవాడు, ధృడమైన సంకల్పం కలిగినవాడు, చారిత్రము కలిగినవాడు, అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, విద్యావంతుడు, సమర్ధుడు, ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంత సౌందర్యం కలిగినవాడు, ధైర్యవంతుడు, క్రోధాన్ని జయించినవాడు, తేజస్సు కలిగినవాడు, ఎదుటివారిలొ మంచిని చూసేవాడు, అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుగోగలిగినవాడు ఉంటె నాకు చెప్పండి అని అడిగాడు.
నువ్వు చెప్పిన గుణాలన్నీ ఒకే మనిషిలొ ఉండడం కష్టమే, కాని ఒకడు ఉన్నాడు, నీకు ఇప్పుడు అతని గురించి చెప్తాను అని నారద మహర్షి ఇలా అన్నారు........
ఇక్ష్వాకువంశములొ రాముడని పేరుగల ఒక వ్యక్తి జన్మించాడు. ఆయనకి నువ్వు అడిగిన 16 గుణాలు ఉన్నాయి అని చెప్పి ఒక 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణాన్ని వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పాడు.
చెప్పిన తరవాత నారదుడు వెళ్ళిపోయాడు. విన్న వాల్మీకి మనస్సు చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు మధ్యాన సమయంలొ సంధ్యావందనం చెయ్యడానికి తమసా నది తీరానికి భారద్వాజుడు అన్న శిష్యుడితో వెళ్లారు. అదే సమయంలో ఒక చెట్టు మీద సంభోగం చేసుకుంటున్న రెండు క్రౌంచ పక్షులని చూశారు. అప్పుడే అక్కడికి వచ్చిన ఒక బోయవాడు పాపనిశ్చయుడై మిధున లక్షణంతో ఉన్న ఆ మగ క్రౌంచ పక్షి గుండెల్లో బాణం పెట్టి కొట్టాడు. కిందపడిన ఆ మగ పక్షి చుట్టూ ఆడ పక్షి ఏడుస్తూ తిరుగుతుంది. అప్పటిదాకా మనసులో రామాయణాన్ని తలుచుకుంటున్న వాల్మీకి మహర్షికి ఈ సంఘటన చూసి, బాధ కలిగి ఆయన నోటివెంట అనుకోకుండా ఒక మాట వచ్చింది...........
మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః|
యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్||
ఓ దుర్మార్గుడైన బోయవాడా! మిధున లక్షణంతో ఉన్న రెండు క్రౌంచ పక్షులలొ ఒక క్రౌంచ పక్షిని కొట్టినవాడ, నీవు చేసిన పాపమువలన నీవు ఎక్కువ కాలం జీవించి ఉండవుగాక, అని శపించాడు.
ఆయన స్నానం ముగించి ఆశ్రమానికి బయలుదేరారు, కాని ఆయన నోట్లో ఈ మాటలు తిరుగుతూనే ఉన్నాయి, మనసులో ఆ క్రౌంచ పక్షులే కనిపిస్తున్నాయి. అలా ఆయన శిష్యులు కూడా ఈ మాటలని ధారణ చేశారు, అలా అది శ్లోక రూపం దాల్చింది. ఇంతలో చతుర్ముఖ బ్రహ్మగారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆశ్చర్యపోయిన వాల్మీకి మహర్షి బ్రహ్మగారిని ఆశ్రమంలోకి తీసుకెళ్ళి కుర్చోపెట్టారు. అప్పుడు బ్రహ్మగారు అన్నారు "ఓ బ్రాహ్మణుడా! నీ నోటివెంట వచ్చిన ఆ శ్లోకమే రామాయణ కథ." అన్నారు. ఆ శ్లోకానికి అర్ధం చూడండి......
"నిషాద" అంటె బోయవాడు అని ఒక అర్ధం, అలాగే సమస్త లోకములు తనయందున్న నారాయణుడు అని ఒక అర్ధం. "మా" అంటె లక్ష్మి దేవి. "మా నిషాద ప్రతిష్ఠాం త్వ మగమః శాశ్వతీః సమాః", అంటె లక్ష్మిని తనదిగా కలిగిన ఓ శ్రీనివాసుడా నీ కీర్తి శాశ్వతముగా నిలబడుగాక. " యత్ క్రౌంచమిథునాదేకమ్ అవధీః కామమోహితమ్", కామము చేత పీడింపబడి, బ్రహ్మగారు ఇచ్చిన వరముల చేత అహంకారము పొంది, కామమే జీవితంగా జీవిస్తున్న రాక్షసుల జంట అయిన రావణ-మండోదరులలో, రావణుడు అనే క్రౌంచ పక్షిని నీ బాణంతో కొట్టి చంపిన ఓ రామ, నీకు మంగళం జెరుగుగాక, అని ఆ శ్లోక అర్ధం మారింది.
బ్రహ్మగారు అన్నారు, "నా శక్తి అయిన సరస్వతి అనుగ్రహం చేత నువ్వు ఈ రోజు రామాయణాన్ని పలికావు. నాయనా, నేను నీకు వరం ఇస్తున్నాను " నువ్వు కూర్చొని రామాయణం రాద్దామని మొదలెడితే, రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ, రాక్షసులు మొదలైన వాళ్ళు మాట్లాడినదే కాదు, వాళ్ల మనస్సులో అనుకున్న విషయాలు కూడా తెలుస్తాయి. ఈ భూమి మీద నదులు, పర్వతాలు ఎంత కాలం ఉంటాయో అంత కాలం రామాయణం ఉంటుంది. ఇందులో ఒక్క మాట అబద్ధం కాని, కల్పితం కాని ఉండదు. నువ్వు ఇంక రామాయణం రాయడం మొదలపెట్టు" అని వరం ఇచ్చి వెళ్ళిపోయారు. వాల్మీకి మహర్షి ధ్యానం చేసి కూర్చోగ ఆయనకి బ్రహ్మ గారి వరం వల్ల జెరిగిన రామాయణం అంతా ఆయనకి కనబడసాగింది. ఆయన రామాయణం రచించడం ప్రారంబించారు. మొత్తం 24,000 శ్లోకాలు, 6 కాండలు, 6 కాండల మీద ఒక కాండ, 500 సర్గల రామాయణాన్ని రచించడం ప్రారంభించారు

శ్రీ వాల్మీకి రామాయణం

రామాయణం -- 1

రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు, అవి, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ కాండలు, 6 కాండల మీద ఒక కాండ, ఉత్తర కాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. కేవలం రాక్షససంహారం కోసమే రామావతారము వస్తే, రావణుడిని చంపిన తరువాత ఆయన అవతార సమాప్తం చెయ్యాలి, కాని ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు, అదేంటంటే, "దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ ", నేను పదకొండువేల సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి, ఈ భూమండలాన్నంతటిని పరిపాలిస్తాను అని.
 రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలలో గడిపాడు, భగవంతుడు కనుక, రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు, భగవంతుడు కనుక, రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు, భగవంతుడు కనుక, రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు, భగవంతుడు కనుక, ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమి ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగ బతికి చూపించలేదు, ఒక మనిషిలాగ బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు.

అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందొ, అంత కాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లితండ్రుల దెగ్గర, సోదరుల దెగ్గర, గురువుల దెగ్గర, భార్య దెగ్గర ఎలా ఉండాలొ, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలొ రాముడిని చూసి నేర్చుకోవాలి.
యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్,తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్ 
బాష్పవారి పరిపూర్ణలోచనమ్,మారుతిం నమత రాక్షసాంతకమ్.
ఎక్కడన్నా రామాయణం గూర్చి మాట్లాడుతుంటె స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు.
రామ అంటె లోకులందరినీ రమింపచేసే నామం. రావణాసురుడు బ్రహ్మ దేవుడి గురించి తపస్సు చేసి నరవానరములు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నాడు. నరవానరాలని ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు, రావణుడే చెప్పాడు, ఇంతమందిని అడిగాను నాకు నరవానరాలు ఒక లెక్క అన్నాడు. రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది. నరుడంటె అంత చులకనగా చూసే రోజుల్లో నరుడిగా పుట్టి, ఒక మనిషి తలుచుకుంటె ఏదన్నా సాధించగలడు అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనిషిగా పుట్టిన ప్రతిఒక్కరు రామనామం చెప్పాలి.

కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్
రాముడి యొక్క ఆయనం(నడక) కనుక దీనికి రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. అలాగే ఆయన రామాయణానికి సీతాయాశ్చచరితమ్ మహత్:, పౌలస్త్య వధ అనే పేర్లు కూడా పెట్టుకున్నారు.

భీముని మల్లారెడ్డిపేట శ్రీ ఆంజనేయస్వామి మాఘ అమావాస్య జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికా

భీముని మల్లారెడ్డిపేట శ్రీ ఆంజనేయస్వామి మాఘ అమావాస్య జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికా

మనో జవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధి మాతం వారిష్టం ,

వాతాత్మజం వానర యుధ ముఖ్యంశ్రీ రామ దూతం శిరసా నమామి


శ్రీ హేవలంబి నామ సంవత్సర పుష్య బహుళ అమవాస్య సరియగుతేదీ 16-01-2018 మంగళవారం రోజున జాతరోత్సవం అత్యంతవైభవంగా నిర్వహించడం జరుగుతుంది కావున భగవత్భక్తులందరూ కూడా  విషయాన్ని గమనించి జాతర లో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని మనవి ...

కార్యక్రమ వివరములు

 తేదీ 16 -01 -2018 మంగళవారం రోజున ఉదయం -05 - ౦౦ గంటలకు శాంతిపాఠం గణపతిపూజ పుణ్యాహవచనం ఆంజనేయస్వామివారికివిశేషాపంచామృత అభిషేకం విశేష పుష్పాలంకరణసేవ మహా మంగళహారతిమంత్రపుష్పమ్ అర్చన తదితర కార్యక్రమాలు ఉదయం 7 .౦౦ గంటల నుండిస్వామి వారి సర్వదర్శనం అర్చిన చందన అలంకారం భక్తులఅందరికి విశేషఅర్చనలు తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు సాయంత్రం 6 .30నిముషములవరకు జాతర ఉత్స్తవములు నిర్వహించటం జరుగుతుందికాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని  స్వామివారి కృపకు పాత్రులుకగలరని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి

ఇట్లు

అంజనేయస్వామి దేవస్థానం

.గ్రామంభీమునిమల్లారెడ్డిపేట్..

మండల్..గంభీరావుపేట ...

శ్రీ శుభమస్తు


లోకసమస్త సుఖినో భవంతు ...

ఆంజనేయునికి తమలపాకులమాలఎందుకు?

ఆంజనేయునికి తమలపాకులమాలఎందుకు?

సీతమ్మ తల్లిని రావణ అపహరించాడు. రామచంద్రుడు సీతమ్మ కోసం అన్వేషణ మొదలుపెట్టాడు. రామునికి అన్వేషణలో సాయడపడుతోన్న ఆంజనేయుడు అశోకవనం చేరుకున్నాడు. సీతమ్మ అక్కడే ఉందన్న విషయాన్ని గ్రహించి విషయాన్ని శ్రీరామునితో చెప్పాలని బయలుదేరాడు. అతడు వెళ్లేటప్పుడు సీతమ్మ ఆశీర్వదించాలని ఆశిస్తుంది. అయితే ఆ వనంలో ఉన్న పుష్పాలు ఆమె చేతికి అందవు. దాంతో పుష్పాలకు బదులుగా తమల పాకును కోసి, ఆంజనేయుని తలమీద పెట్టి దీవిస్తుంది. అందుకే ఆంజనేయుని తమలపాకు ప్రీతిపాత్రమైనది.
అది మాత్రమే కాదు. సీతమ్మ వద్దనుంచి తిరిగి వెళ్తూ... ఆకాశంలో పయనిస్తూ... గట్టిగా హూంకరిస్తాడు ఆంజనేయుడు. అది విన్న వానరులకు విషయం అర్థమైపోతుంది. ఆంజనేయుడు కచ్చితంగా సీతమ్మ జాడ తెలుసుకునే వస్తున్నాడని అర్థం చేసుకున్న వానరులంతా వేయి కళ్లతో ఆంజనేయుడి కోసం ఎదురు చూస్తారు. అతడు రాగానే తమలపాకుల తీగలతో సన్మానం చేస్తారు. అది చూసి హనుమంతుడు ఆనందంతో పొంగిపోతాడు. అందువల్లే ఆంజనేయునికి తమలపాకుల మాలను వేస్తే స్వామి పరమానందం చెంది దీవెనలు కుమ్మరిస్తాడని అంటారు.
హనుమంతుడు జ్యోతి స్వరూపుడు. ఆయన్ని పూజిస్తే కష్టాలు మాయమైపోతాయి. అవరోధాలు తొలగిపోతాయి. అందుకే ప్రతి మంగళ, శనివారాల్లో హనుమంతునికి ప్రపంచ వ్యాప్తంగా పూజలు జరుగుతాయి. పూజలో భాగంగా ఆయనకు ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలను సమర్పిస్తే మనోభీష్టాలు నెరవేరతాయి. అది మాత్రమే కాక హనుమాన్ చాలీసాను సైతం పారాయణం చేస్తే సర్వసంపదలూ సుఖసంతోషాలూ వెతుక్కుంటూ వస్తాయి.

శ్రీ పంచముఖ హనుమత్కవచం

శ్రీ పంచముఖ హనుమత్కవచం

శ్రీ గణేశాయ నమః ఓం శ్రీపంచవద నాయాంజనేయాయ నమః!
ఓం అస్య శ్రీ పంచముఖ హనుమన్మంత్రస్య బ్రహ్మో ఋషిః, గాయత్రీ చందః, పంచముఖ విరాట్ హనుమాన్ దేవతా, హ్రీం బీజం, శ్రీం శక్తి: క్రౌం కీలకం క్రూం కవచం, క్రైం అస్త్రాయ ఫట్ ఇతి దిగ్బందః!! శ్రీ గరుడ ఉవాచ -
అథ ధ్యానం ప్రవక్ష్యామి - శృణు సర్వాంగసుందరి!
యత్కృతం దేవదేవేన - ధ్యానం హనుమతః ప్రియమ్!!
పంచవక్త్రం మహాభీమం - త్రిపంచనయనై ర్యుతం!
బాహుభి ర్దశభి ర్యుక్తం - సర్వకామార్థ సిద్ధిదమ్!!
పూర్వం తు వానరం వక్త్రం - కోటిసూర్య సమప్రభం!
దంష్ట్రాకరాళ వదనం - భృకుటీ కుటిలేక్షణమ్!!
అస్వైవ దక్షిణం వక్త్రం - నారసింహం మహాద్భుతం !
అత్యుగ తేజోవపుషం - భీషణం భయనాశనమ్!!
పశ్చిమం గారుడం వక్త్రం - వక్రతుండం మహాబలం !
సర్వనాగా ప్రశమనం - విషభూతాది కృంతనమ్!!
ఉత్తరం సౌకరం వక్త్రం - కృష్ణం దీప్తం సభోపమం!
పాతాళ సింహ బేతాళ - జ్వర రోగాడి కృన్తనమ్!!
ఊర్థ్యం హయాననం ఘోరం - దానవాంతకరం పరం !
యేన వక్త్రేణ విప్రేంద్ర - తారకాఖ్యం మహాసురమ్!!
జఘాన శరణం తత్స్యాత్సర్వ శత్రుహారం పరమ్!
ధ్యాత్వా పంచాముఖం రుద్రం - హనుమంతం దయానిధిమ్!!
ఖడ్గం త్రిశూలం ఖట్వాంగం - పాషా మంకుశ పర్వతం!
ముష్తిం కౌమోదకీం వృక్షం - ధారయన్తం కమండలుమ్!!
భిన్డి పాలం జ్ఞానముద్రాం - దశభి ర్మునిపుంగవం!
ఏతా న్యాయధజాలాని - ధారయన్తం భాజా మ్యహమ్!!
ప్రేతాస నోపవిష్టం తం - సర్వాభరణ భూషితం !
దివ్యమాల్యాంబరధరం - దివ్యగంధానులేపనమ్!!
సర్వాశ్చర్యమయం దేవం - హనుమ ద్విశ్వతోముఖం!
పంచాస్య మచ్యుత మనేక విచిత్రవర్ణం
వక్త్రం శశాంకశిఖరం కపిరాజవర్యం
పీతాంబరాది ముకుటై రుపశోభితాంగం
పింగాక్ష మాద్య మనిశం మనసా స్మరామి!!
మర్కటేశ! మహోత్సాహ! సర్వశత్రు హరంపరం
శత్రుం సంహార మం రక్షా శ్రీమ న్నాపద ముద్ధర!!
ఓం హరిమర్కట మరకత మంత్ర మిదం
పరిలిఖ్యతి లిఖ్యతి వామతలే
యది నశ్యతి నశ్యతి శత్రుకులం
యది ముంచతి ముంచతి వామలతా!!
ఓం హరిమర్కట మర్కటాయ స్వాహా!!
ఓం నమో భగవతే పంచవదనాయ పూర్వకపిముఖాయ సకలశత్రు సంహారణాయ స్వాహా!
ఓం నమోభగవతే పంచవదనాయ దక్షిణముఖాయ కరాళవదనాయ నరసింహాయ సకల భూత ప్రమథనాయ స్వాహా!!
ఓం నమో భగవతే పంచవదనాయ పశ్చిమముఖాయ గరుడాననాయ సకలవిశ హరాయ స్వాహా! ఓం నమో భగవతే పంచవదనాయ ఉత్తరముఖ మాదివరహాయ సకలసంపత్కరాయ స్వాహా! ఓం నమో భగవతే పంచవదనాయ ఊర్థ్వముఖాయ హైగ్రీవాయ సకలజన వశంకరాయ స్వాహా! ఓం అస్య శ్రీ పంచముఖ హనుమన్మంత్రస్య శ్రీ రామచంద్ర ఋషిః; అనుష్టుప్చందః; పంచముఖ వీరహనుమాన్ దేవతా! హనుమా నీతి బీజం' వాయుపుత్ర ఇతి శక్తి:' అన్జనీసుట ఇతి కీలకమ్; శ్రీరామదూత హనుమత్ర్పసాద సిద్ధ్యర్దే జపే వినియోగః!!
ఓం అంజనీసుతాయ అంగుష్ఠాభ్యాం నమః!
ఓం రుద్రమూర్తయే తర్జనీభ్యాం నమః!
ఓం వాయుపుత్రాయ మధ్యమాభ్యాం నమః!
ఓం అగ్నిగర్భాయ అనామికాభ్యాం నమః!
ఓం రామదూతాయ కనిష్ఠికాభ్యాం నమః!
ఓం పంచముఖ హనుమతే కరతల కరపృష్ఠాభ్యాం నమః!
ఏవం హృదయాదిన్యాసః!
పంచముఖహనుమతే స్వాహా ఇతి దిగ్భంధః!
ధ్యానం :-
వందే వానర నారసింహ ఖగరాట్ క్రోడాశ్వ వక్త్రాన్వితం
దివ్యాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా
హస్తాబ్జె రసి ఖేట పుస్తక సుధాకుంభాం కుశా ద్రిం హలం
ఖట్వాంగం ఫణి భూరుహం దశభుజం సర్వారి వీరాపాహమ్!!
అథ మంత్ర :-
శ్రీరామదూతా యాంజనేయాయ వాయుపుత్రాయ మహాబల పరాక్రమాయ సీతాదుఃఖ నివారణాయ లంకాదహన కారణాయ మహాబల ప్రచండాయ ఫల్గుణసఖాయ కోలాహల సకల బ్రహ్మాండ విశ్వరూపాయ సప్తసముద్ర నిర్లంఘనాయ పింగళ నాయనా యామితవిక్రమాయ సూర్యబింబ ఫలసేవనాయ దుష్టనివారణాయ దృష్టి నిరాలంకృతాయ సంజీవినీ సంజీవి తాంగద లక్ష్మణ మహాకపిసైన్య ప్రాణదాయ దశకంఠ విధ్వంసనాయ రామేష్టాయ మహాఫల్గుణసఖాయ సీతాసహిత రామ వరప్రదాయ, షట్ప్రయోగాగమ పంచముఖ వీర హనుమన్మంత్రజపే వినియోగః!!
ఓం హరిమర్కట మర్కటాయ బం బం బం బం బం వౌషట్ స్వాహా!
ఓం హరిమర్కట మర్కటాయ ఫం ఫం ఫం ఫం ఫం ఫం ఫట్ స్వాహా!
హరిమర్కట మర్కటాయ ఖేం ఖేం ఖేం ఖేం ఖేం మారణాయ స్వాహా!
ఓం హరిమర్కట మర్కటాయ లుం లుం లుం లుం లుం ఆకర్షిత సకలసంపత్కరాయ స్వాహా!
ఓం హరిమర్కట మర్కటాయ ధం ధం ధం ధం ధం శత్రుస్తంభనాయ స్వాహా!
ఓం టం టం టం టం టం కూర్మమూర్తయే పంచముఖ వీరహనుమతే పరయంత్ర పరతంత్రోచ్చాటనాయ స్వాహా!
ఓం కం ఖం గం ఘం జం చం ఛం జం ఝం ఇం టం ఠం డం ఢం ణం తం థం దం ధం నం పం ఫం బం భం మం యం రం లం వం శం షం సం హం ళం క్షం స్వాహా! ఇతి దిగ్బందః!
ఓం పూర్వకపిముఖాయ పంచముఖ హనుమతే టం టం టం టం టం సకలశత్రు సంహారణాయ స్వాహా! ఓం దక్షిణముఖాయ పంచముఖ హనుమతే కరాలవదనాయ నరసింహాయ ఓం హ్రీం హ్రీం హ్రుం హ్రైం హ్రౌం హ్రః సకలభూతప్రేత దమనాయ స్వాహా! ఓం పశ్చిమముఖాయ గరుడాననాయ పంచముఖ హనుమతే మం మం మం మం మం సకలవిష హరాయ స్వాహా! ఓం ఉత్తరాముఖాయదివరహాయ లం లం లం లం లం నృసింహాయ నీలకంఠమూర్తయే పంచముఖ హనుమతే స్వాహా! ఓం ఊర్ధ్వముఖాయ హయగ్రీవాయ రుం రుం రుం రుం రుం రుద్రమూర్తయే సకల ప్రయోజన నిర్వాహకాయ స్వాహా! ఓం అంజనీసుతాయ వాయుపుత్రాయ మహాబలాయ సీతాశోక నివారణాయ శ్రీరామచంద్ర కృపాపాదుకాయ మహావీర్య ప్రమథనాయ  బ్రహ్మాండనాథాయ కామదాయ పంచముఖ వీరహనుమతే స్వాహా! భూతప్రేత పిశాచ బ్రహ్మరాక్షస శాకినీ డాకిన్యన్తరిక్షగ్రహ పరయంత్ర పరతంత్రోచ్చాటనాయ స్వాహా! సకల ప్రయోజన నిర్వాహకాయ పంచముఖ వీరహనుమతే శ్రీరామచంద్ర వరప్రసాదాయ జం జం జం జం జం స్వాహా!

ఇతి శ్రీ సుదర్శనసంహితాయాం శ్రీరామచంద్ర సీతాప్రోక్తం శ్రీ పంచముఖ హనుమత్కవచం సంపూర్ణమ్!!